navageetam.com
Newspaper Banner
Date of Publish : 25 January 2026, 10:56 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు

నవగీతం,చొప్పదండి

చొప్పదండి పట్టణ కేంద్రానికి పలువురు కరీంనగర్ ఇందిరా భవన్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పార్టీలో వడ్లూరి సరిత-శ్రీనివాస్ దంపతులు, వడ్లూరి రాజయ్య, సింహాచలం తులసి -ప్రభాకర్ దంపతులు చేరగా కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నిజానపురం చందు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పురం రాజేశం, ముద్దం తిరుపతి గౌడ్, పెరుమాండ్ల గంగయ్య గౌడ్, కొట్టె అశోక్, వల్లాల కృష్ణహరి, ముద్దసాని రంగన్న, మునిగాల సుధాకర్ , మునిగాల చందు, గుంటి స్వరూప, పిట్టల వెంకటేష్, లింగంపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.