navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 6:48 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే కార్యకర్తల ఫలితమే.. పొంగులేటి

డీసీసీ అధ్యుక్షులు ఇనుగాల వెంకటరామిరెడ్డి ప్రమాణ స్వీకారం

నవగీతం, వరంగల్

హన్మకొండ జిల్లా డీసీసీ అధ్యుక్షులు ఇనుగాల వెంకటరామిరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.అనంతరం డీసీసీ అధ్యుక్షులు ఇనుగాల వెంకటరామిరెడ్డి ని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలో ఉందంటే కార్యకర్తలు అభిమానుల కష్ట ఫలితమే. పేదవారికి ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా పరిపాలన చేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం.జరిగిన ఎన్నికల్లో రెఫరెండం అని హెచ్చులకు పోయి బొక్కబోర్ల పడ్డా కూడా రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలు సెమీఫైనల్స్ అవి మీకు రెఫరెండం అని అవాకులు, చెవాకులు పేలుతున్న మాజీ మంత్రి . వరుసగా జరుగుతున్న ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్టం కడుతున్న తీరు చూస్తుంటే ఇక ముందు జరుగబోయే ఏ ఎన్నికల్లో అయిన మీ బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం అని తెలిసే రోజులు దగ్గర పడ్డాయి. అధికారంలోకి వస్తా అనే పగటి కలలు కనడం మానుకొని, ముందు  ఇంట గెలిచి రచ్చ గెలవమని సూచనచేస్తున్నా.తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు సంవత్సరాలతో పాటు, మరో ఐదు సంవత్సరాలు కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వమే తప్పకుండా అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఎవరైతే కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారో వారిని ఈ పార్టీ అక్కున చేర్చుకుంటుందని కార్యకర్తలకు ధ్యైర్యాన్ని ఇవ్వడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక పెద్ద కుటుంబం దేశంలో మరియు రాష్ట్రంలో-భిన్నమతాలు- భిన్నకులాలు ఏ విధంగా ఉంటాయో. అదేవిధంగా వరంగల్ కాంగ్రెస్ పార్టీలో   కూడా భిన్నభిప్రాయాలు ఉన్నోళ్లు ఉంటారు, అయినా కూడా వారి సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, వారి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఆలోచనగానే ఉంటది కాబట్టి ఇంటికి పెద్దన్నగా, పెద్దదిక్కుగా ప్రతి వర్గాన్ని, ప్రతి మిత్రుణ్ణి కాపాడుకోవాల్సిందిగా వెంకట్రామిరెడ్డి అన్నని మనస్ఫూర్తిగా  కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మంత్రి ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ఎంపీ కడియం కావ్య , ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య , ఎమ్మెల్యేలు దొంతి మాధవ రెడ్డి , రేపూరి ప్రకాష్ రెడ్డి , నాయిని రాజేందర్ రెడ్డి , కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.