నవగీతం,చొప్పదండి:
చొప్పదండి పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఒలుగొత్తుల సురేష్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని రాబోవు చొప్పదండి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో మనుపాటి మల్లేశం, ఒలుగొత్తుల నరసయ్య, ఇరిశెట్టి సునీల్, మావురపు అజయ్ ఉన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ కొత్తూరు మహేష్, పట్టణ అధ్యక్షుడు నిజానపురం చందు, ఆత్మ ఛైర్మన్ గుర్రం రాజేందర్ రెడ్డి, వల్లాల కృష్ణహరి, పెరుమాండ్ల గంగయ్య గౌడ్, ముద్దం తిరుపతి, కొట్టె అశోక్, రాజన్నల తిరుపతి, బండారి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.