navageetam.com
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 10:21 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే జనరల్ వార్డులలో పోటీ చేస్తా

పార్టీ నిర్ణయమే శిరోధార్యం:

వీరంశెట్టి సీతారాములు

నవగీతం,వైరా:

వైరా మున్సిపాలిటీకి త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆదేశిస్తే మున్సిపాలిటీలోని జనరల్ వార్డులలో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు కాంగ్రెస్ వైరా పట్టణ నాయకులు వీరంశెట్టి సీతారాములు ఉన్నట్లు తెలుస్తుంది. వీరంశెట్టి సీతారాములు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో అవార్డు నాయకులతో కలిసి ఎన్నో కార్యక్రమాలు పాల్గొని పార్టీని ముందుకు నడిపించేందుకు అందరితో కలిసి ప్రయాణించాడు, ఆపదలో ఉన్న వారికి కూడా అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చాడు, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే జనరల్ వార్డులలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని వీరం శెట్టి సీతారాములు తెలుపుతున్నాడు . ఇదే విషయమ వీరంశెట్టి సీతారాములు ను వివరణ అడగగా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న దానికి అనుగుణంగా పనిచేస్తానని ,వారు ఆదేశిస్తే జనరల్ వార్డులలో ఎక్కడ నుంచి అయినా తప్పకుండా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి పోటీ చేస్తానని సీతారాములు తెలుపుతున్నారు.