కాలనీలోనే రేషన్ ఇవ్వాలని తహసీల్దార్‌కు వినతి
నవగీతం, కొడిమ్యాల: కొడిమ్యాల మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో రేషన్ షాపు ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన స్థానిక తహసీల్దార్ కిరణ్ కు వినతిపత్రం అందజేశారు.ఇందిరానగర్ కాలనీలో దాదాపు 100కు పైగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఉండగా, ప్రతి నెలా బియ్యం పొందేందుకు గ్రామంలోని ప్రధాన రేషన్ దుకాణానికి రావాల్సి వస్తోందని తెలిపారు. దీని వల్ల ముఖ్యంగా వృద్ధులు, ఒంటరి మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భారీగా బియ్యం మోసుకెళ్లడం వారికి కష్టసాధ్యంగా...