కొండగట్టు అగ్నిప్రమాద బాధితులకు రూ.1కోటి 12 లక్షల పైగా ఆర్థిక సాయం
నవగీతం,చొప్పదండి జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు దిగువ ప్రాంతంలో గత నవంబర్ 29న రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నష్టపోయిన 31 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.83,12,000/-తో పాటు విద్యుత్ శాఖ ద్వారా రూ.29,00,000/- విలువైన చెక్కులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ చెతుల మీదుగా...