navageetam.com
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 7:36 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కోట్లాదిమంది యువతకి వివేకానందుడు ఆదర్శం. భోగ శ్రావణ

నవగీతం,జగిత్యాల

స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని సోమవారం జగిత్యాల పట్టణంలోని 49వ వార్డ్ లోగల స్వామి వివేకానంద విగ్రహానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి నివాళులర్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ భోగ శ్రావణి మాట్లాడుతూ భారతదేశంలో ప్రఖ్యాత సిద్ధిగాంచిన ఆధ్యాత్మిక నాయకులు మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప జ్ఞాని మన స్వామి వివేకానంద జయంతిని ప్రతి సంవత్సరం జనవరి 12వ తేదీన ఇదే రోజున జాతీయ యువజన దినోత్సవం గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అన్నారు. ఎందుకంటే వివేకానందునికి యువతతో చాలా లోతైన అనుబంధం ఉంది. అందుకే తన పుట్టినరోజు యువతకు అంకితం ఇవ్వబడింది ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది యువత వివేకానందుని ఆదర్శంగా తీసుకుంటారు యువతను సరైన మార్గంలో నడిపించేందుకు తను ఎన్నో విజయ రహస్యాలను అందరితో పంచుకున్నారు. ఆయన ఆలోచనలు ఆశయాలను అనుసరించిన వారి వ్యక్తిత్వం కచ్చితంగా మారుతుంది. అంతేకాదు మీలో సానుకూల మార్పులు కూడా వస్తాయి.ఈ సందర్భంగా వివేకానందుడు యువతను ప్రేరణ నిచ్చే సూక్తులు స్ఫూర్తివంతమైన సందేశాలు ఎన్నో ఉన్నాయి. సోమవారం వారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారికి నివాళులర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ రాజన్న, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల సత్యనారాయణ, ముద్దం రాము, మరిపెళ్లి సాగర్, మేడిపల్లి పుష్ప రెడ్డి, గాదాసు రాజేందర్, భోగ రాజు కుమార్,దూరిశెట్టి మమత,సింగం పద్మ, మామిడాల కవిత, కడార్ల లావణ్య, పిండేరు భాను ప్రియ, నక్క జీవన్,కొక్కుల ధర్మేందర్,కుక్కల శ్రీకాంత్, మరియు బిజెపి జగిత్యాల్ పట్టణ మరియు జిల్లా పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.