కోరుట్ల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

నవగీతం, కోరుట్ల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శనివారం ఆకస్మికంగా కోరుట్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేర నియంత్రణకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. స్టేషన్‌లో నిర్వహిస్తున్న కేసు డైరీలు, జనరల్ డైరీ, రిజిస్టర్లు, ఇతర రికార్డులను ఎస్పీ గారు సవివరంగా పరిశీలించి, రికార్డుల నిర్వహణపై తగిన సూచనలు చేశారు. విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శించాలని, ప్రజలకు పోలీసుల అందుబాటు...