navageetam.com
Newspaper Banner
Date of Publish : 10 January 2026, 8:54 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కోరుట్ల ప్రీమియర్ క్రికెట్ లీగ్ ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది.

నవగీతం, మెట్ పల్లి

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కీ.శే.జువ్వాడి రత్నాకరరావు జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన కోరుట్ల ప్రీమియర్ క్రికెట్ లీగ్ లో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్,ఎస్పీ అశోక్ కుమార్, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు, డీసీసీ అధ్యక్షులు నందయ్య, మాజీ మున్సిపల్ ఛైర్మన్ అడువల జ్యోతి తో కలిసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ,సమన్వయం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. కోరుట్ల ప్రీమియర్ క్రికెట్ లీగ్ వంటి పోటీలు గ్రామీణ స్థాయి క్రీడా ప్రతిభను వెలికితీయడంలో ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. జువ్వాడి రత్నాకరరావు జ్ఞాపకార్థంగా ఈ లీగ్‌ను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుకు సాగాలని, క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజవర్గ కాంగ్రెస్ నాయకులు గ్రామీణ సర్పంచ్లు ప్రజాప్రతినిలు తదితరులు పాల్గొన్నారు