navageetam.com
Newspaper Banner
Date of Publish : 04 January 2026, 3:14 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కోర్టు భవనాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి..

హైకోర్టు న్యాయమూర్తి సుజన

నవగీతం, నిర్మల్

నిర్మల్ జిల్లాలో నూతన కోర్టు భవనాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి న్యాయ సేవలకు వినియోగంలోకి తీసుకురావాలని హైకోర్టు న్యాయమూర్తి సుజన అన్నారు. సారంగాపూర్ మండలం చించోలి–బి గ్రామ సమీపంలో న్యాయస్థానాల భవనాల నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తులు సుజన, లక్ష్మణ్, నర్సింగ్ రావు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు కోర్టుల ఆధునీకరణతో ప్రజలకు వేగవంతమైన న్యాయ సేవలు అందుతాయని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, నూతన కోర్టు భవనాల నిర్మాణంతో ప్రజలకు, న్యాయవాదులకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు.

అంతకు ముందు జిల్లా కేంద్రానికి చేరుకున్న న్యాయమూర్తులకు, అటవీ శాఖ వసతిగృహంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, ఎస్పీ జానకి షర్మిల, ఇతర అధికారులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు.