navageetam.com
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 12:33 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

క్రీడలు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి: ఇప్ప శ్రీనివాస్ రెడ్డి

నవగీతం,చొప్పదండి

చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీలను గ్రామ సర్పంచి గన్ను శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.వారు మాట్లాడుతూ క్రీడలు శారీరకంగా దృఢంగా ఉంచడంతో పాటు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయన్నారు. క్రీడల వల్ల ఓటమి గెలుపులతో సంబంధం లేకుండా క్రీడాకారుల మధ్య స్నేహ సంబంధాలు మెరుగువతాయని, పోటీలో పాల్గొంటున్న అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలుపుతూ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కోనేరుపల్లె, సాంబయ్యపల్లె సర్పంచులు కాసు వేణుగోపాల్ రాజు, మాచర్ల రమాదేవి జగన్ కాట్నపల్లి ఉప సర్పంచ్ గన్ను నరేందర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ చుప్ప శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి గాజంగి రాములు, కట్టెకోల లక్ష్మణ్, రామగిరి శ్రీనివాస్, గన్ను నర్సింహారెడ్డి, వార్డు సభ్యులు దుర్గం శేఖర్ లింగంపల్లి శంకర్, బండారి దేవేందర్, కట్టెకోల కార్తీక్, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.