గద్వాల సోమన్న “మట్టి పరిమళం” పుస్తకావిష్కరణ

   నవగీతం,తిరుపతి నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న విరచిత "మట్టి పరిమళం" పుస్తకావిష్కరణ పిల్లల ప్రపంచం, సైన్స్ సెంటర్ తిరుపతిలో సాహితీ సంక్రాంతి బాలానందం - బాల సాహితోత్సవం సందర్బంగా ఘనంగా జరిగాయి.ఈ సభకు వక్తగా వెళ్లిన కవి సోమన్న తన పుస్తకాలను అవధాని ఆముదాల మురళి,సభాధ్యక్షలు డా. కిట్టన్న, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత గంగిశెట్టి శివకుమార్,యువశ్రీ మురళీ, విద్వాన్ గోవిందయ్య, కళాపోషకులు ఏ. ఎల్. కృష్ణారెడ్డి, పిళ్ళై చంద్రశేఖర్ మరియు విచ్చేసిన ప్రముఖుల...