నవగీతం,మెట్ పల్లి
గాయత్రి బ్యాంకు మెట్‌పల్లి శాఖ ఆధ్వర్యంలో బ్యాంకు ఖాతాదారునికి సంబంధించిన ఇన్సూరెన్స్ చెక్కును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అందజేశారు.గాయత్రి బ్యాంకు మెట్‌పల్లి శాఖ ఖాతాదారు, సత్తక్కపల్లి గ్రామానికి చెందిన పాతూరి శివరామకృష్ణ కొన్ని నెలల క్రితం జరిగిన బైక్ ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతి చెందారు.గాయత్రి బ్యాంకులో ప్రతి ఖాతాదారునికి గాయత్రి నిర్భయ సేవింగ్స్ పథకం ద్వారా రూ.1,00,000/- ప్రమాద ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.ఈ నేపథ్యంలో నామినీ అయిన వారి అమ్మ పాతూరి శ్రీలత కి గాయత్రి బ్యాంకు ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు.