navageetam.com
Newspaper Banner
Date of Publish : 21 January 2026, 12:48 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

గ్రామపంచాయతీ రికార్డులు పరిశీలించిన ఎంపీడీవో

నవగీతం,మల్లాపూర్

మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో మండల ఎంపిడిఓ శ్రీకాంత్ పర్యటించారు. గ్రామపంచాయతీ లో రికార్డులను తనిఖీ చేశారు. ఆశా కార్యకర్తలతో మాట్లాడి పలు హెల్త్ రికార్డులను తనిఖీ చేశారు.నూతనంగా సాంక్షన్ అయిన వి.వో బిల్డింగ్ స్థలం పరిశీలన హెల్త్ సబ్ సెంటర్ ను సందర్శన, ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి వారికి పని ని తొందరగా పూర్తి చేయాలని కోరారు. నర్సరీ మరియు పల్లె ప్రకృతి వనం నీ సందర్శించి వాటి గురించి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బాల్సని ప్రణయ్, సంపతి ఆశలు,గ్రామ కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు.