నవగీతం,మల్లాపూర్
మాల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో ధనుర్మాసం ఉత్సవాల సందర్భంగా బుధవారం గోదారంగనాధుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. పురోహితులు ప్రవీణ్ కుమార్ శర్మ ధనుర్మాస విశిష్టతను గోదాదేవి రంగనాదుల కళ్యాణ ఘట్టం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పలత నర్సయ్య రాజారెడ్డి రాజశేఖర్ గంగాధర్, మల్లేష్, శ్రీనివాస్ అంజయ్య కొండయ్య మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు