navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 10:28 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

చిట్టాపూర్ లో ఇందిరమ్మ చీరలు పంపిణీ

నవగీతం, మల్లాపూర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో చిట్టాపూర్ గ్రామంలో మహిళలకు గ్రామ సర్పంచ్ సంపతి శంకరమ్మ , ఉప సర్పంచ్ బాల్సని ప్రణయ్ గౌడ్ వారి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మహిళలకు ఎన్నో పథకాలు అందిస్తూ మహిళలు ముందుకు వెళ్లాలని ప్రోత్సహిస్తూ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించి గౌరవంగా జీవించేలా చేస్తుంది. నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు, ఉచిత బస్సు సర్వీసు అందిస్తూ మహిళలను ముందుకు తీసుకెళ్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు కొండబత్తిని లావణ్య, రామగిరి సంజీవ్, పబ్బతిజ్యోతి, ఉప్పులూటి లక్ష్మీ నారాయణ, పాశం నవ్య,కార్యదర్శి రుత్త అశోక్, వివోలు సులోచన, నీల, మహిళలు తదితరులు పాల్గొన్నారు.