చైనీస్ మాంజాపై ఉక్కుపాదం
విక్రయించినా, నిల్వ చేసినా క్రిమినల్ కేసులు హైదరాబాద్ సీపీ సజ్జనర్ నవగీతం, హైదరాబాద్ సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనీస్ మాంజా విక్రయాలు, వాడకంపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ తెలిపారు. పక్షుల స్వేచ్ఛకు, అమాయక వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్న ఈ ప్రమాదకరమైన మాంజాను ఎవరైనా రహస్యంగా విక్రయించినా, నిల్వ ఉంచినా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు....