navageetam.com
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 8:46 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

చొప్పదండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

నవగీతం,చొప్పదండి:

77 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చొప్పదండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను చొప్పదండి శాసన సభ్యులు మేడిపల్లి సత్యం ఆవిష్కరణ చేశారు. తదనంతరం మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నిజనపురం చందు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటి రెడ్డి పద్మాకర్ రెడ్డి,ఆత్మ చైర్మన్ గుర్రం రాజేందర్ రెడ్డి ప్రజా ప్రతినిధులు మార్కేట్ కమిటీ డైరెక్టర్స్,గ్రామ శాఖ అధ్యక్షులు, మహిళా నాయకులు కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు