navageetam.com
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 11:35 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

జంతు ప్రదర్శనశాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం

తల్లి జన్మదినం సందర్భంగా  జిరాఫీలను దత్తత తీసుకున్న డిప్యూటీ సీఎం

నవగీతం,విశాఖపట్నం

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు. తల్లి శ్రీమతి అంజనా దేవి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్ లోని రెండు జిరాఫీలను ఏడాదిపాటు దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రెండు జిరాఫీలకు ఏడాదిపాటు అయ్యే ఖర్చు మొత్తం భరించనున్నట్టు ప్రకటన జంతు సంరక్షణకు కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.       జూ పార్క్ లో నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్ క్లోజర్ ను ప్రారంభించారు. జూపార్క్ లోని నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎంక్లోజర్ల వద్దకు వెళ్లి వాటికి అందించే ఆహారం, వాటి పేర్లు తదితర వివరాలు జూ క్యూరేటర్ ని అడిగి తెలుసుకున్నారు. ఏనుగులు, జిరాఫీల శాలలను పరిశీలించి వాటికి స్వయంగా ఆహారం అందించారు. జంతు శాలల్లో ఆహారం అందించేందుకు వెళ్లే సమయాల్లో జూ నిబంధనలు పాటించారు. కంబాలకొండ ఎకో పార్క్ లో నగర వనాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎకో పార్క్ లోని చెక్క వంతెనపై కనోపీ వాక్ చేశారు. మార్గం మధ్యలో మొక్కల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.