నవగీతం,జగిత్యాల
జగిత్యాల జిల్లాకు నియమింపబడిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి పొలం బాట పట్టి గ్రామీణ ప్రజల స్థితిగతులను తెలుసుకున్నారు. ధర్మపురి మండలం తిమ్మాపూర్, బూరుగుపల్లి గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి పర్యటించారు. పొలంలో వ్యవసాయ కూలీలతో మమేకమై వరినాట్లు వేసి గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకున్నారు. వ్యవసాయ పనులు చేసే వారికి లంచ్ సమయంలో పండ్లుపంపిణీ చేశారు. డిప్యూటీ కలెక్టర్ గ్రామీణ మహిళల తో కలిసి పొలంలో వరి నాట్లు వేసి సంతోషం వ్యక్తం చేశారు.