జనవరి 16న ఎస్వీ గోశాలలో గోపూజ మహోత్సవం
నవగీతం,తిరుపతి తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాల లో జనవరి 16న కనుమ పండుగ సందర్భంగా గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఉదయం 5 గం.ల నుండి 10.30 గం.ల వరకు శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకం, పూజ, హారతి కార్యక్రమం జరుగనుంది. ఉదయం 10.30 గం.ల నుండి 11.15 గం.ల వరకు గోపూజ, కటమ, అశ్వ, వృషభ, గజ పూజ జరుగనుంది. తదుపరి 11.15 గం.లకు దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన, కోలాటాలు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం...