navageetam.com
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 7:19 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

జనసేన పార్టీలో భారీగా చేరికలు

నవగీతం,హైదరాబాద్

జనసేన పార్టీ జిహెచ్ఎంసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో పార్టీలోకి చేరికలు మొదలయ్యాయి. సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి నుండి వైరా నియోజకవర్గ ఇంచార్జి సంపత్ నాయక్ ఆధ్వర్యంలో, భారీ సంఖ్యలో నేడు జనసేన పార్టీలో చేరారు. కూకట్ పల్లి నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ నేమురి శంకర్ గౌడ్, జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలోనే మల్కాజ్‌గిరి నుండి మరి కొన్ని పార్టీలు చేరికలు ఉండబోతున్నాయని తెలియచేసారు.