navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 4:07 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

జర్నలిస్టుల అరెస్టుపై టీయూడబ్ల్యూజే ఆగ్రహం

నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం

నవగీతం, పెద్దపల్లి

ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎన్టీవీ ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణ చారి,రమేష్‌లను సిట్ పోలీసులు అరెస్టు చేయడాన్ని టీయూడబ్ల్యూజే-ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షులు మల్లవర్జల వంశీ,కార్యదర్శి నారాయణదాసు అశోక్, పెద్దపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు వీరమల్ల విద్యాసాగర్ రావు,ఆకుల రమేష్ లు తీవ్రంగా ఖండించారు.తప్పుడు వార్తలు రాసినా,ప్రసారం చేసినా చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని,కానీ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సిట్ పోలీసులు అరెస్ట్ చేయడం తగదన్నారు. జర్నలిస్టులు దేశ ద్రోహులు కాదని, పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.