జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: సియం ఎ.రేవంత్ రెడ్డి
నవగీతం, హైదరాబాద్ జర్నలిస్టుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, తన పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను తన దృష్టికి తెస్తే తప్పకుండా వాటిని పరిష్కరిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ప్రతినిధి బృందం సచివాలయంలో సియంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. అలాగే యూనియన్ రూపొందించిన 2026 మీడియా డైరీని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరింపజేసింది. ఈ సందర్భంలో జర్నలిస్టులకు నూతన సంవత్సర కానుకగా సంక్షేమ పథకాలు అందించాలని యూనియన్...