navageetam.com
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 9:01 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి శోభారాణి

నవగీతం,జగిత్యాల:

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని పునరుద్దరించాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  తాటిపర్తి శోభారాణి అన్నారు. జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలం బతికేపల్లి గ్రామంలో ఉపాధి హామీ వర్కర్స్ తో మంగళవారం మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి శోభారాణి అధ్యక్షతన సమావేశం జరుగగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి,పెగడపల్లి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సింగసాని విజయలక్ష్మి లు హాజరయ్యారు.ఈ సందర్బంగా శోభారాణి మహిళా కూలీలనుద్దెశించి మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు.మహాత్మా గాంధీ  మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన గొప్ప మహనీయుడని ఆమే కొనియాడారు. ఉపాధిహామీ పథకానికి గాంధీ  పేరు లేకుండా చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుoదని  శోభారాణి ఆరోపించారు. ఎంతోకాలంగా దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాల ఫలితంగా ఎంజిఎన్ఆర్ఇజిఎఎస్ రూపుదిద్దుకుందని, ప్రతి చేతికి పని, పనికి తగ్గ వేతనం అనే హామీ ఈ పథకం ద్వారా ప్రజలకు సిద్ధించిoదని శోభారాణి తెలిపారు. గ్రామీణ భారతంలో పని కోరుకునే వారికి చట్టబద్ధమైన హక్కును కల్పించిందని ఆమే గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 100 రోజులు ఉపాధికి కూలీలకు భరోసా కల్పిస్తూ హామీ ఇచ్చిందని, వికేంద్రీకృత పాలనను బలోపేతం చేసిందని శోభారాణి ఉద్గాటించారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని శోభారాణి డిమాండ్ చేశారు. తదుపరి మహిళలతో మాట్లాడి కేంద్రం కుట్ర పూరిత ధోరణి వివరించి, కూలీల ఇబ్బంది, సమస్యలను శోభారాణి, విజయలక్ష్మిలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో బతికేపల్లి సర్పంచ్ ముంజ మహేశ్వరి మధుకర్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు సింగసాని విజయలక్ష్మి, మహిళల పాల్గొన్నారు.