navageetam.com
Newspaper Banner
Date of Publish : 01 January 2026, 2:33 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ప్రారంభం

నవగీతం, మెట్ పల్లి

మెట్ పల్లి పట్టణ ఆర్టీసీ డిపో గ్యారేజ్ లో డిపో మేనేజర్ మామిడాల సరస్వతి ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్ , ఎస్ ఐ కిరణ్ కుమార్ విచ్చేశారు ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ ట్రాఫిక్ నియమాల గురించి ప్రసంగించి రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోషించాలని తెలిపారు అనంతరం డిపో మేనేజర్ సరస్వతి మాట్లాడుతూ ఈ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఈ నెల తేదీ. 01 నుండి 31 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా జనవరి 1 ప్రారంభ వేడుకలు జనవరి 6 డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ కౌన్సిలింగ్ దినం జనవరి 7 వైద్య పరీక్షల దినం జనవరి 8 నిర్వహణ దినం జనవరి 2 కుటుంబ కౌన్సిలింగ్ దినం జనవరి 22 రక్తదాన శిబిరాల నిర్వహణ జనవరి 24 డ్రైవర్స్ డే జనవరి 31 సన్మాన దినం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ సరస్వతి తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారి మెట్ పల్లి సి ఐ అనిల్ కుమార్ , ఎస్ ఐ కిరణ్ కుమార్ డి ఎం సరస్వతి ట్రాఫిక్ సూపర్డెంట్ టీ. ప్రమీల ఎం సి చంద్రయ్య సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ ముజిబ్ ఖాన్ సూపర్వైజర్లు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు