77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పోలీస్ స్టాల్ ప్రదర్శన.
నవగీతం,జగిత్యాల:
77 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, కార్యాలయ అధికారులకు సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలితం మే గణతంత్ర దినోత్సవం అని వారిని ఎప్పుడూ మనం స్మరిస్తూ ఉండాలి అని వారి త్యాగఫలం ద్వారా మనం ఈరోజు ఎంత స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపినారు. మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత సమాజంలో ఏ విలువలకు కట్టుబడి ఉండాలి అనేది రాజ్యాంగంలో రూపొందించబడింది తెలిపారు.

స్వేచ్ఛ ,సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలతో మన రాజ్యాంగం రూపొందించబడింది అని ఈ యొక్క రాజ్యాంగానికి కట్టుబడి ప్రతి ఒక్క చట్టం అమలు చేయబడుతుంది అని తెలిపారు. ఈ చట్టాలను అమలు చేసే బాధ్యత అందరికంటే ముందుగా పోలీసు డిపార్ట్మెంట్ పై ఉందని కాబట్టి ఈ యొక్క విలువలను మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ యొక్క విలువలకు కట్టుబడి చట్టాలను అమలు చేస్తామని, జిల్లా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.

గణతంత్ర దినోత్సవ సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో పోలీస్ శాఖ వారిచే ఏర్పాటు చేయబడిన స్టాల్, డాగ్ స్క్వాడ్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ యొక్క స్టాల్ లో పోలీస్ వ్యవస్థ పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఉపయోగించే అధునాతన సాధనాలు, పోలీస్ శాఖ అవలంబిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, సైబర్ క్రైమ్, షీ టీమ్స్, ప్రింగర్ ప్రింట్, కమ్యూనికేషన్, బాబ్ డిస్పోసల్ టీమ్,ఆయుధాల గ్యాలరీ, డాగ్ స్క్వాడ్ , మొదలగు వాటి పై సవివరంగా తెలియజేసేందుకు ఏర్పాటుచేసిన స్టాల్స్ ల ప్రదర్శన అందరిని ఆకర్షించింది.ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరమణ , ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీ ఖాన్ ,కిరణ్ కుమార్,సుధాకర్, శ్రీధర్ ,కరుణాకర్ ఆర్ ఎస్ ఐ లు హెడ్ క్వార్టర్ సిబ్బంది,మరియు తదితరులు పాల్గొన్నారు.