నవగీతం, కొడిమ్యాల
కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన మొహమ్మద్ షాదుల్లాను తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ కులాల సమితి జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోవిటి సదానంద చారి, రాష్ట్ర ముఖ్య సలహాదారులు అంబటి రవీందర్ రాజు, రాష్ట్ర ప్రణాళిక కమిటీ చైర్మన్ అలిపిరెడ్డి చంద్రమౌళి, జిల్లా అధ్యక్షులు చింతల మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి బాబు, ఖాజా మొయినుద్దీన్‌లు ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బీసీ కులాల అభివృద్ధి కోసం చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బీసీలు ఎదగడానికి నిరంతరం కృషి చేయాలని షాదుల్లాను కోరారు.