జీవో 190 అమలుకు చర్యలు చేపట్టాలి.

జీవో 317 బాధితులకు న్యాయం చేయాలి-టిఆర్టిఎఫ్ డిమాండ్ నవగీతం,జగిత్యాల జీఓ317 అమలులో ఏర్పడిన లోపాలను సరిదిద్దుతూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ190ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని అలాగే పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల డిప్యుటేషన్ ప్రక్రియను మున్సిపల్ ఎన్నికల కంటే ముందే పూర్తిచేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ అదనపు ప్రధాన కార్యదర్శి బేతి సాయికృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీఓ 317 కారణంగా అనేక మంది ఉపాధ్యాయులు అన్యాయంగా డిస్‌లోకేటెడ్ అయి, కుటుంబాల నుంచి దూరంగా,తీవ్రమైన మానసిక-ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు....