టిటిడి ఆధ్వర్యంలో కొండగట్టులో అభివృద్ధి పనులు – టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు

నవగీతం,హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పరిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు తెలిపారు. కొండగట్టులో ఆలయ అభివృద్ధి పనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ కొండగట్టులో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టిటిడిని కోరడంతో, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...