టిటిడి కల్యాణ మండపాల నిర్వహణపై సమగ్ర నివేదిక రూపొందించాలని టిటిడి ఈవో ఆదేశం
నవగీతం, తిరుపతి దేశంలోని వివిధ ప్రాంతాలలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన టిటిడి కల్యాణ మండపాల నిర్వహణపై సమగ్ర నివేదికను రూపొందించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన అంతర్గత ఆడిట్ సమావేశంలో ఆయన సమీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, టిటిడి కల్యాణ మండపాలు ఆదరణలో ఎన్ని ఉన్నాయి, ఆదరణ లేనివి ఎన్ని, ఆధునీకరించబడినవి ఎన్ని, తదితర స్థితిగతులు, భక్తులు సౌకర్యవంతంగా వినియోగించుకోవడానికి సమగ్ర విధానాన్ని రూపొందించి టిటిడి పాలక...