నవగీతం, వరంగల్
గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ పరిధిలోని ధర్మారంలో టీజీ ఎన్పీడీసీఎల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా బాట కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ప్రజా బాట కార్యక్రమం ద్వారా ప్రతి వారం ఒక ట్రాన్స్ఫార్మర్ పరిధిలోని సమస్యలను గుర్తించి వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అధికారులు బాధ్యతతో పని చేయాలని కోరారు. ఏఈ దిలీప్ మాట్లాడుతూ లూజ్ లైన్లు ఉన్న విరిగిపోయిన పోల్స్ ఉన్న,పవర్ ఇష్యూ ఉన్న మా దృష్టికి తీసుకు వచ్చినట్లయితే వెంటనే సమస్య పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ ఏఈ దిలీప్ ,సబ్ ఇంజనీర్ గంగుల. క్రాంతి,లైన్ ఇన్స్పెక్టర్ లు రాజనరేందర్, ఉపేందర్, ఏఎల్యం లు శశికుమార్, రవీందర్,హెల్పర్ నారాయణ, అధికారులు,సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.