navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 6:14 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పర్యవేక్షించిన ఎస్పీ, కలెక్టర్

నవగీతం, జగిత్యాల

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లు పరిశీలించారు. డిప్యూటీ సిఎం పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సభా స్థల ఏర్పాట్లు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. అనంతరం హెలిప్యాడ్, శిలాపలకం గుడి ఆవరణ ప్రదేశంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.రేపటి పర్యటన నేపథ్యంలో కొండగట్టు ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు, మరియు పోలీసు బందోబస్త్ ఉంటుందని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు సంయమనం పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బి.రాజ గౌడ్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డి.ఆర్.డి.వో రఘువరన్, ఆర్ అండ్ బి ఈ.ఈ శ్రీనివాస్, డీఎస్పీ రఘు చందర్, ఆలయ ఈ.వో, ట్రైని డిప్యుటీ కలెక్టర్ హరిణి లతో పాటు సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.