తిరుపతిలో వైభవంగా గోదా కల్యాణం
తన్మయత్వంలో భక్తులు నవగీతం,తిరుపతి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో గల మైదానంలో గురువారం రాత్రి కన్నుల పండువగా గోదా కల్యాణం జరిగింది. కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు.ముందుగా శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి అర్చకస్వాములు కల్యాణ వేదిక మీద వేంచేపు చేశారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీవిష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణం, రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. సర్కారు సంకల్పం, భక్తుల...