నవగీతం,రుద్రంగి
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల పరిధిలోని దసరా నాయక్ తండాకు సిసి అప్రోచ్ రోడ్డు హైలెవల్ వంతెన నిర్మాణం కోసం ఇటీవల రూ. 2కోట్ల 50 లక్షల ట్రైబల్ వెల్ఫేర్ నిధులు మంజూరు కాగా అట్టి రోడ్డును శనివారం ఏఈ శ్రీరాముల మాధూరి పరిశీలించారు. అనంతరం ఆమే మాట్లాడుతూ.. హైలెవల్ బ్రీడ్జీ అప్రోచ్ రోడ్డు నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపారు. ఏఈ వెంట వ్యవసాయ మార్కెట్ కమిటి చెర్మెన్ చెలుకల తిరుపతి, సర్పంచ్ గండి నారాయణ, వార్జు సభ్యుడు సత్యనాయక్, నాయకులు గడ్డం శ్రీనివాస్ ఉన్నారు.