navageetam.com
Newspaper Banner
Date of Publish : 04 January 2026, 9:01 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు.

నవగీతం, తిరుపతి/కడప

కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జనవరి 19 నుండి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. జనవరి 18వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.కాగా, జనవరి 24వ తేదీ ఉదయం 10.30 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. జనవరి 28న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది.వాహన సేవలలో భాగంగా శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారు ఉదయం 09.00 గం.ల నుండి 10.00 గం.ల వరకు రాత్రి 08.00 గం.ల నుండి 09.00 గం.ల వరకు విహరించి భక్తులను  అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భ‌క్తి సంగీత‌ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ.19.01.2026 ఉదయం – ధ్వజారోహణం (మీన లగ్నం) రాత్రి – చంద్రప్రభ వాహనం

20.01.2026 ఉద‌యం – సూర్యప్రభవాహనం రాత్రి – పెద్దశేష వాహనం

21.01.2026 ఉద‌యం – చిన్నశేష వాహనం రాత్రి – సింహ వాహనం

22.01.2026 ఉద‌యం – కల్పవృక్ష వాహనం రాత్రి – హనుమంత వాహనం

23.01.2026 ఉద‌యం – ముత్యపుపందిరి వాహనం రాత్రి – గరుడ వాహనం.

24.01.2026 ఉద‌యం – కల్యాణోత్సవం రాత్రి – గజ వాహనం

25.01.2026 ఉద‌యం – రథోత్సవం రాత్రి – ధూళి ఉత్సవం

26.01.2026 ఉద‌యం – సర్వభూపాల వాహనం రాత్రి – అశ్వ వాహనం

27.01.2026 ఉద‌యం – వసంతోత్సవం, చక్రస్నానం రాత్రి – హంసవాహనం, ధ్వజావరోహణం.