ధర్మరక్షణ-లోక కల్యాణార్థం శ్రీ భక్త మార్కండేయ స్వామి దీక్షల ఆరంభం
నవగీతం,నిజామాబాద్ ధర్మ రక్షణకై, లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న శ్రీ భక్త మార్కండేయ స్వామి మాల ధారణ దీక్షలు శనివారం రోజున నిజామాబాద్ లోని కోటగల్లీ శ్రీ మార్కండేయ స్వామి మందిరంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, శ్రీ భక్త మార్కండేయ స్వామి విశేష పూజలు నిర్వహించగా, అఖిల భారత మార్కండేయ స్వామి మాల ధారణ దీక్షల మార్గదర్శకులు గురుస్వామి శ్రీ పద్మకులరత్న చిలుక నర్సప్ప మార్కండేయ ఆధ్వర్యంలో మాల ధారణ కార్యక్రమం ఆధ్యాత్మిక వైభవంతో జరిగింది.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, శ్రీ...