navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 1:45 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నాచుపల్లి ప్రభుత్వ పాఠశాల తనిఖీ చేసిన నోడల్ అధికారి బృందం

నవగీతం, కొడిమ్యాల

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల పరిధిలోని నాచుపల్లి గ్రామ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను ప్రత్యేక తనిఖీ బృందం–3 మంగళవారం  సందర్శించి పరిశీలించారు పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాలను సబ్జెక్టుల వారీగా పరిశీలించిన బృందం, ఉపాధ్యాయుల బోధన తీరు, రికార్డుల నిర్వహణ, సైన్స్ ల్యాబ్ నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలను నోడల్ అధికారి మానుపాటి బన్నా నేతృత్వంలో సమీక్షించింది. పదో తరగతి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల విధానం, విద్యార్థుల మార్కుల మూల్యాంకన రికార్డులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి బన్నా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యాశాఖ డైరెక్టర్ డా. నవీన్ నికోలస్ సూచనలతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరును మెరుగుపరచి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా జిల్లా విద్యాధికారులు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ బృందం జగిత్యాల జిల్లాలోని సుమారు 55 ప్రభుత్వ పాఠశాలలను  తనిఖీ చేయనుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి గ్రీష్మంత్ ఇటీవల సబ్‌జూనియర్ ఖో-ఖో పోటీలలో రాష్ట్రస్థాయికి ఎంపికైనందుకు అభినందించి, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థికి శిక్షణ అందించిన ఫిజికల్ డైరెక్టర్ బీరయ్యను ప్రత్యేకంగా అభినందించారు.పాఠశాల తనిఖీ అనంతరం ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి తగిన సూచనలు చేశారు.ఈ తనిఖీ బృందంలో నోడల్ అధికారి మానుపాటి బన్నా, రాజశేఖర్ ,శ్రీధర్ , వంగపల్లి సంపత్ కుమార్  నర్సయ్య  నారి బూట్ల రాజమల్లయ్య  పాల్గొన్నారు. పాఠశాల సిబ్బందిలో ప్రధానోపాధ్యాయులు బాబురావు, ఏ. రాజగంగయ్య వి. శ్యామల , జి ఉమారాణి , ఏ. కవిత  స్వాతి , బి. జ్యోతి , ఈ. బీరయ్య  వెంకటరమణ తదితరులు హాజరయ్యారు.