నాచుపల్లి ప్రభుత్వ పాఠశాల తనిఖీ చేసిన నోడల్ అధికారి బృందం

నవగీతం, కొడిమ్యాల జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల పరిధిలోని నాచుపల్లి గ్రామ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను ప్రత్యేక తనిఖీ బృందం–3 మంగళవారం  సందర్శించి పరిశీలించారు పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాలను సబ్జెక్టుల వారీగా పరిశీలించిన బృందం, ఉపాధ్యాయుల బోధన తీరు, రికార్డుల నిర్వహణ, సైన్స్ ల్యాబ్ నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలను నోడల్ అధికారి మానుపాటి బన్నా నేతృత్వంలో సమీక్షించింది. పదో తరగతి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల విధానం, విద్యార్థుల మార్కుల మూల్యాంకన రికార్డులను కూడా...