-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
బ్రతుకులోని దుర్గుణాలు
భోగి మంటల్లో కాల్చి
సుగుణాల ఆభరణాలు
నిలువెల్లా ధరించాలి
ప్రవర్తన లో పరివర్తన
మధుమాసమై రావాలి
పెద్దవారి దీవెనలు
సెలయేరులై పారాలి
కాసింత మనిషితనము
మనసులోన క్షమాగుణము
పూలై పరిమళించాలి
ప్రేమ వనమే కావాలి
సంపద ఎంత ఉన్నా
మానవత్వం తరిగితే
జీవితాన గుండు సున్న
అక్షరాల నిజమన్న!
సంస్కారం నీదైతే
నైతిక విలువలు తోడైతే
జీవితాల్లో నవ కాంతి
అప్పుడే నిజ సంక్రాంతి