నవగీతం, మెట్ పల్లి
కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అందులో భాగంగా మెట్ పల్లి కోరుట్ల మున్సిపాలిటీ లో ఓటర్ లిస్టులో ఉన్న లోపాలు, అభ్యంతరాలపై చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని,అలాగే గ్రామాల్లో తాగునీటి అవసరాల దృష్ట్యా కొత్త బోరింగులు మంజూరు, మన ఊరు – మనబడి నిధులు మంజూరు చేయాలని తెలిపారు.ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఈజీఎస్‌కు మార్చి, ఏఎస్సార్ తండా, పాటిమీది తండాలలో గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణం చేపట్టాలని కోరారు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేయాలని, అలాగే హెల్త్ సబ్ సెంటర్లకు సంబంధించిన నిధులు వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లా