navageetam.com
Newspaper Banner
Date of Publish : 09 January 2026, 1:21 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నిరుపేద కుటుంబానికి సోషల్ మీడియా ద్వారా ఆర్థిక సాయం

నవగీతం, వెల్గటూర్

వెల్గటూర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో గత ఐదు రోజుల క్రితం క్రితం నల్లూరి లక్ష్మి అనే మహిళా అనారోగ్యంతో మృతి చెందింది. కాగా లక్ష్మిది చాలా నిరుపేద కుటుంబం. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, సోషల్ మీడియా నుండి పలువురు దాతలు సేకరించిన సుమారుగా రూ.75,500 నగదు, 50కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా అల్లం అనిల్ కుమార్ సోషల్ మీడియా సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సహాయ కోరిన వెంటనే స్పందించిన దాతలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.