navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 1:08 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నిరుపేద మహిళకు కుట్టుమిషన్ అందజేత

నవగీతం,వైరా

వైరా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ కోశాధికారి గద్దె నీరజ పుట్టినరోజు పురస్కరించుకొని నిరుపేద మహిళకు సాయిబాబా మందిరంలో లయన్ మెంబర్ తిరుపతి శ్రీనివాసరావు చొరవతో కుట్టు మిషన్ ను ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ చేతులు మీదుగా బుధవారం జిల్లా మార్కెటింగ్ కోఆర్డినేటర్ లగడపాటి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఎంతో మంది నిరుపేదలను ఆదుకుంటూ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ముందుందని ఆయన తెలిపారు ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రమాదవశాత్తు గాయపడిన మహిళకు లగడపాటి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో పదివేల రూపాయలు అందించామని అదే స్ఫూర్తితో ఎంతోమంది చదువుకు దూరమైన నిరుపేద విద్యార్థులను గతంలో కూడా ప్రభాకర్ రావు ఆదుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇదే స్ఫూర్తితో బుధవారం పుట్టినరోజు జరుపుకుంటున్న క్లబ్ కోశాధికారి గద్దెనీరజ ఎల్ సి ఎఫ్ ఐ కోఆర్డినేటర్ చింతలపూడి వెంకటేశ్వరరావు పుట్టినరోజు కూడా బుధవారం జరుపుకోవడం ఆనంద దాయకమని ఆయన అన్నారు. ప్రతి క్లబ్ సభ్యులు తమ తమ పెళ్లిరోజులు పుట్టినరోజులు సేవా కార్యక్రమాలకు సేవ ద్వారా అందించి అర్హులైన నిరుపేదలను అందర్నీ ఆదుకోవాలని సూచించారు. లయన్స్ క్లబ్ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలను మురళీకృష్ణ తెలియజేశారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి లయన్స్ క్లబ్ సభ్యులందరూ ఇరువురికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విజన్ కోఆర్డినేటర్ ఉండ్రు శ్యాంబాబు క్లబ్బు మహిళా కోఆర్డినేటర్ మాదినేని సునీత క్లబ్ సెక్రటరీ చెరుకూరి శ్రీనివాసరావు జోన్ చైర్మన్ చింతోజు నాగేశ్వరరావు రీజన్ సెక్రెటరీ పెనుగొండ ఉపేందర్ రావు సాయిబాబా మందిరం కోశాధికారి లగడపాటి బోస్ తిరుపతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.