నవగీతం, ఇల్లంతకుంట
ఇల్లంతకుంట మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను సర్పంచ్ మామిడి రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పనుల్లో నాణ్యత పై ఏమాత్రం రాజీ పడకుండా ప్రతి దశలో పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్మాణ పనులు చేపట్టాలని. నిర్ణీత గడువులోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. అధికారులు పూర్తయిన పనుల డబ్బులు లబ్ధిదారులకు వెంటనే వారి ఖాతాలో జమ అయ్యేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, ఒగ్గు రమేష్, అనిల్, స్వామి, బాబు, రాజు తదితరులు పాల్గొన్నారు.