నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి పిల్లల ఆసుపత్రిని వేగంగా పూర్తి చేయాలి – టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్
నవగీతం, తిరుపతి అలిపిరి సమీపంలో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవనాన్ని వేగంగా పూర్తి చేయాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంను, నిర్మాణంలో ఉన్న నూతన భవనాన్ని శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రి వైద్యులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ నూతన ఆసుపత్రి భవనం పూర్తి అయ్యే సమయానికి భవనానికి అవసరమయ్యే మానవ వనరులు,ఆపరేషన్ యంత్రాలు,...