విద్యుత్ అధికారులు ఏ డి ఏ, ఏ ఈ
నవగీతం, మెట్ పల్లి
మెట్ పల్లి మండలం వేంపేట్ గ్రామంలో లోవోల్టేజి సమస్య వల్ల చాలా నష్టం జరుగుతుంది అని చెప్పగానే వేంపేట్ గ్రామానికి ఏ డీ ఏ పిప్పోజీ రవి , ఏ ఈ బండారి రమేష్ వచ్చి గతంలోనే గ్రామంలో అదనంగా రెండు ట్రాన్స్ఫర్మర్లు శాంక్షన్ అయ్యాయని, వాటికి 11కేవీ వైర్లు అందుబాటులోకి తేవాలంటే ఉన్న సమస్యలను చెప్పి, పరిశీలించి వీలైనంత తొందరగా కొత్త ట్రాన్స్ఫర్మర్లు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.పాలకవర్గం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి గ్రామానికి వచ్చిన వారికి సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్, ఉపసర్పంచ్ అల్లూరి సురేందర్ రెడ్డి, కార్యదర్శి పాకాల రాజు లు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఏ ఎల్ మ్ ప్రవీణ్, వార్డు మెంబర్లు చంద్రాచారి దశకంఠ రాజు, జెల్ల శ్రీనివాస్, నలిమెల అంజిరెడ్డి,పందిరి లత,మారంపెల్లి లత, మగ్గిడి శైలజ,పెంటపర్తి సోని లు ఉన్నారు