జిల్లా ఉపాధ్యక్షులు వేల్పులరామయ్య
నవగీతం,వైరా
వైరా మున్సిపల్ ఎన్నికల బరిలో బీఎస్పీ నిలుస్తుందని జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల రామయ్య అన్నారు. గురువారం స్థానిక పార్టీ ఆఫీసులో వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ కారుమంచి నాగరాజు తో కలిసి ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. వేల సంవత్సరాలుగా దోపిడి, అణిచివేతకు గురవుతున్న బహుజన సమాజం విముక్తి చెందాలంటే మహాత్మ జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో, మాన్యవర్ కాన్షీరామ్ పని విధానంతో ,మాయావతి గారి నాయకత్వంలో ముందుకెళ్తున్న బీఎస్పీ తోనే సాధ్యమని ఆయన అన్నారు. మిగిలిన అన్ని పార్టీలు 10 శాతం ఉన్న ఆధిపత్య కులాల నాయకత్వంలో బంధీయై ఉన్నాయని బీసీ, ఎస్సీ ,ఎస్టీ, మైనార్టీల నాయకత్వంలో పనిచేసే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీయేనని ఆయన అన్నారు. ప్రధాన స్రవంతి పార్టీలకు దీటుగా ఎన్నికల బరిలో బీఎస్పీ నిలుస్తుందని, బీఎస్పీ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు క్రియాశీలకంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.