navageetam.com
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 2:09 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నేరానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించడంలో ప్రజలు పోలీసులకు సహకరించలి

నవగీతం, మెట్ పల్లి

మెట్ పల్లి పట్టణంలోని కళానగర్ ఎస్సారెస్పీ కెనాల్ పక్కన గల దోబీఘాట్ సమీపంలో, ఫిల్టర్ బెడ్ వద్ద ఈ నెల 20,న ఉదయం పదిన్నర గంటల సమయంలో పట్టణానికి చెందిన వన్నెల గంగు , ఆమె కుమారుడు వన్నెల రవికుమార్‌లు లపై ఇద్దరు గుర్తుతెలియని మగ వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేసి, తీవ్రంగా గాయపరిచి, గంగు మెడలో ఉన్న బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని పరారయ్యారు. సిసి కెమెరాల ఆధారంగా సేకరించిన నిందితులకు సంబంధించిన ఫోటోలు , వీడియోలను పోలీసులు రిలీజ్ చేశారు. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించడంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.పైన పేర్కొన్న ఫోటోలలోని వ్యక్తుల గురించి గానీ, వారి కదలికల గురించి గానీ ఖచ్చితమైన సమాచారం అందించిన వారికి నగదు బహుమతి అందజేయబడుతుంది. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని, వారికి పోలీస్ ఉన్నతాధికారుల నుండి ప్రత్యేక ప్రశంసా పత్రాలు అందిస్తామని తెలిపారు.