మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పడిగెల ప్రవీణ్ కుమార్ రెడ్డి
14 నుండి 18 వరకు వ్యవసాయ మార్కేట్ కు సెలవులు
నవగీతం, పెద్దపల్లి
సంక్రాంతి పండుగలు మరియు వారాంతపు సెలవుల నేపథ్యంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పడిగెల ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.ఈ నెల 14న భోగి,15న సంక్రాంతి,16న కనుమ పండుగల సందర్భంగా మార్కెట్‌కు సెలవు ఉంటుందని,ఆ తర్వాత 17,18 శని,ఆదివారాలు పత్తి క్రయవిక్రయాలకు సాధారణ విరామం ఉంటుందని పేర్కొన్నారు.వెరసి జనవరి 14 నుండి 18 వరకు మార్కెట్ యార్డ్‌లో పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు.రైతులు ఈ విషయాన్ని గమనించి,పత్తి పంటను విక్రయానికి తీసుకురావద్దని కోరారు.తిరిగి జనవరి 19 నుండి మార్కెట్ యార్డ్ యధావిధిగా పునః ప్రారంభమవుతుందని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.