పద్మశాలీలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి
నవగీతం, జగిత్యాల దేశంలో ప్రత్యేకమైన, గొప్ప వృత్తి నైపుణ్యాన్ని కలిగిన ఘనత కేవలం పద్మశాలీకే ఉందని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజేంగి నందయ్య, జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ కొనియాడారు. ఆదివారం జగిత్యాల జిల్లా మాల్యల మండల కేంద్రంలో నిర్వహించిన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశంలో నూతనంగా ఎన్నికైన పద్మశాలి సర్పంచ్ లను, వార్డు మెంబర్లను సన్మానించి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పద్మశాలీలు అన్ని రంగాల్లో అభివృద్ధి...